Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
లక్నవరం ప్రధాన కాల్వలో ఒకటైన శ్రీరామ్పతి కాలువ గండ్లను వెంటనే పూడ్చాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కాల్వకు పడిన గండ్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ లక్నవరం చెరువు కింద మండలంలో ప్రధానంగా ఇటీవల కురిసిన వర్షాలకు శ్రీరామ్పతి కాలువకు మూడు చోట్ల పెద్ద గండ్లు పడ్డాయని వెంటనే అధికారులు పూడ్చాలని డిమాండ్ చేశారు. రైతులు నార్లు పోసుకొని 20 రోజులు దాటిందని మండలంలో నాట్లు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటికే ప్రధాన కాలువలు సిల్ట్ పిచ్చి మొక్కలు, గడ్డి పేరకపోయి కాల్వలో నీరు రాకుండా ఉన్నాయని ప్రభుత్వ వెంటనే కాల్వల గండ్లు పూడ్చి, పూడిక వెంటనే తీయాలన్నారు. మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం స్పందించి నష్టాన్ని వ్యవసాయ అధికారులతో సర్వే చేయించాలని రైతులకు విత్తనాలు వెంటనే సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తీగల ఆదిరెడ్డి రైతులు బండి శేఖర్ గౌడ్ చింత వీరమల్లు ధారావత్ కిషన్ నాయక్ గుండు రామస్వామి సామ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.