Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని గోదావరి వరద ప్రాంతాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం పర్యటించారు. మండలంలోని మంగపేట, కమలాపురం, అకినే పల్లి మల్లారం, నర్సాపురం బోరు, రాజుపేట, బ్రాహ్మణపల్లి, కత్తిగూడెంలోని పునరావాస కేంద్రాల్లోని ప్రజలను పరామర్శించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్షం కారణంగా గోదావరి వరద ప్రాంతంలోని ప్రజలకు భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగపేట, కమలాపురం గ్రామాలకు వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలు మనో దైర్యంతో ఉండాలని బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం 25 వేలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వరదలతో నష్ట పోయిన రైతులకు ఉచితంగా వరి, పత్తి, మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. కరకట్టల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 137 కోట్లు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ ల జాప్యంతో పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే యుద్ద ప్రాతిపదికన కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మండల పార్టీ అద్యక్షుడు మైల జయరాం రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇసార్ ఖాన్ సీనియర్ నాయకులు వల్లేపల్లి శివయ్య తదితరులు పాల్గొన్నారు.