Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరావాస కేంద్రాల బాధితులకు భరోసా
నవతెలంగాణ -మహదేవపూర్/భూపాలపల్లి/పలిమెల
గోవావరి ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడ ద్దని వారికి అండగా ఉంటామని జయశంకర్ భూపా లపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పలిమెల మండలాల్లోని ముంపు ప్రాంతాలల్లో పర్యటించిన ఎస్పి గారు, పెగడ పల్లి, ముకునూరు, పలిమెల పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధిత ప్రజలతో మాట్లాడి, వారికి భరోసా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావద్దని ఆపదలో ఉన్న వారు వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ, సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షం కారణంగా గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పి గారు ఆదేశించారు. గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఉన్నందున కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ సందర్శించడానికి పర్యాటకులు, ప్రజలు రావద్దని ఎస్పి జె. సురేందర్ రెడ్డి గారు కోరారు.
మారుమూల అటవీ ప్రాంతమైన
పలిమేల మండలంలోని గోదావరి పరివాహక ప్రాం తాలైన సర్వాయిపేట, కనుకునూరు, మూకునూ రుతో పాటు, వివిధ గుత్తి కోయ గూడేలను, లోతట్టు ప్రాంతా లను ఎస్పి స్వయంగా సందర్శించి, బాధి తులకు పండ్లు, కొన్ని నిత్యావసర వస్తువులు అందజేశారు. అలాగే వరదలు, మరియు వర్షాల దష్ట్యా వరద ప్రభావిత ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాలని ఎస్పి సూచించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుం టుందని వారికి భరోసా ఇచ్చారు. పెరుగుతున్న వరద ఉదృతి దష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటు వంటి ఇబ్బందులు కలగకుం డా సంబంధిత శాఖల సహ కారంతో అవసరమయిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికా రులకు ఆదేశించారు. ఈ కార్య క్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర్, కాటారం డిఎస్పీ బోనాల కిషన్, మహదేవ్ పూర్, సిఐ కిరణ్, కాటారం సిఐ రంజిత్ రావు, ఎస్సైలు రాజ్ కుమార్, అరుణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.