Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ డిఎంహెచ్వో క్రాంతి కుమార్
నవతెలంగాణ-తాడ్వాయి
18 ఏళ్లు దాటి, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని 6 నెలలు పూర్తయిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో కోరం క్రాంతికుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని బీరెల్లిలో బూస్టర్ డోస్ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 30 మందికి బూస్టర్ డోస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తర్వాత ఇప్పుడు ప్రభుత్వం బూస్టర్ డోస్ తీసుకోవడం తప్పనిసరి చేసిందని తెలిపారు. ఇది కరోనా వైరస్ ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుందని పేర్కొన్నారు. బూస్టర్ డోస్ మీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని తెలిపారు. మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే మీ టీకాను రద్దు చేసి దాన్ని మళ్లీ షెడ్యూల్ చేయడం, వేరే తేదీ మార్చుకోవడం మంచిదని తెలిపారు. బూస్టర్ డోస్ తీసుకునే ముందు ఆహారంలో పప్పు, గుడ్లు, పాలు, ఆకుపచ్చ కూరలు మొదలైన బలవర్ధకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు.
ఉచిత ఆరోగ్య శిబిరం
మండలంలోని బీరెల్లిలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌తో పాటు, ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 100 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితం గా మందులు పంపిణీ చేశారు. 15 మందికి రక్త నమూనాలు సేకరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున మొన్నటి వరకు ముసురు వానలు బాగా కురిశాయి. పరిసరాలలో గడ్డి, చెత్తా,చెదారం, పిచ్చి మొక్కలు బాగా మొలిచి దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతాయని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిపిఎంఓ సంజీవరావు, హెచ్ఈఓ సమ్మయ్య, హెల్త్ అసిస్టెంట్లు అనిల్, ముత్తయ్య, ఏఎన్ఎం పుష్ప, ఎల్ టి శ్రీధర్ ఆశా వర్కర్లు రోగులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్సీలో బూస్టర్ డోస్
సంగెం : 18 సంవత్సరాల వయసు నిండి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నావారు ఆరు నెలల సమయం పూర్తయిన తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హులని మండల వైద్యాధికారి డాక్టర్ పొగాకుల అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం
శుక్రవారం నుండిఇ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఉచిత టీకా కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. మండలం లోని అర్హులందరూ ఈ కార్యక్రమాన్ని వినియో గించుకొని బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలు తు న్నందున కాచి చల్లార్చిన నీటిని తాగాలి, వేడి ఆహార పదార్థాలను తినాలన్నారు.