Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
విశ్వకోయ గోండు భాషా దినోత్సవం ప్రభుత్వమే అధికారికంగా నిర్వ హించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షులు దాట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. విశ్వ కోయ గోండు బాషా దినోత్సవ వేడుకలు గురువారం మండలకేంద్రం లోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల సమావేశపు హాలులో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు సిద్ధబోయిన భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోయభాషను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తిసఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని ఆదివాసీి ప్రజలు దాదాపు 5 కోట్లమంది మాట్లాడుతున్నారన్నారు. భారత రాజ్యాం గంలోని 8వ షెడ్యూల్ ప్రకారం కోయ భాషాను జాత్యాయ భాషాగా గుర్తించి ఆయా రాష్ట్రాల్లోని వారి మాతృభాషా అయిన కోయ భాషాలోనే ప్రాథమిక తరగతుల్లో విద్యాబోధనలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆటా రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఈ సం సురేందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోకాళ్ళు సుధీర్, జిల్లా ఉపాధ్యాక్షులు ఈక నాగేశ్వరరావు, జిల్లా సిద్ధబోయిన వెంకన్న , ఆట జిల్లాకమిటీ సభ్యులు అలెం వెంకటమ్మ, ఆట మండల అద్యక్షులు బూర్క రాకేష్ వర్మ, ప్రవీన్, శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.