Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రికి జీఎంపీఎస్ వినతి
నవతెలంగాణ-రఘునాథపల్లి
గొర్లపెంపకం దారులను ఇబ్బందులకు గురిచేస్తున్న సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జీఎంపీఎస్ నాయకులు కోరారు. గురువారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును హన్మకొండలో ఆయన అతిథి గహంలో జీఎంపీఎస్ జనగామ జిల్లా కమీటీ నాయకులు మర్యా దపూర్వకంగా కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... మండలంని అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన గొర్ల కాపర్లు గొర్ల పిచ్చయ్య ఎల్ల బోయిన సురేష్ 400 గజాల స్థలాన్ని కొను గోలు చేసు కొని గొర్రెల షెడ్డు నిర్మించగా అదే గ్రామంలో రెడ్డి సామాజిక తరగతికి చెందిన కొంతమంది పాత కక్షలను దష్టిలో పెట్టుకుని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. గొర్ల షెడ్డుతో పరిశుభ్రత లోపిస్తోందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. ఇదే సాకుతో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో గొర్రెలు ఉండొద్దని తీసేయాలని లేకుంటే కేసులు పెట్టి జైలుకు పంపుతామని, భారీ జరిమానా విధిస్తామంటూ మూడు నెలల నుంచి మూడు సార్లు నోటీసులు ఇచ్చారని వాపోయారు. ఈనెల 16న గ్రామ సభ తీర్మానం చేసి మరొక నోటీసు జారీ చేశారన్నారు. అశ్వరావుపల్లి సర్పంచ్, పంచా యతీ కార్యదర్శులను తొలగించి భవిష్యత్‌లో ఇలాంటి సంఘ టనలు పునరావతం కాకుండా న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జనగామ జిల్లా కార్యదర్శి సాదం రమేష్, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం గౌరవ అధ్యక్షుడు నమిలి గొండ ఎంపీటీసీ రజాక్‌యాదవ్, మండల అధ్యక్షులు గుండ వెంకటయ్య, బుచ్చయ్య, సురేష్ పాల్గొన్నారు.