Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత
నవతెలంగాణ-లింగాలఘనపురం
నిలువ నీడలేని నీరుపేదలందరూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉన్నవారికి వెంటనే ప్రభుత్వం, అధికారులు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని కళ్లెం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆమె సందర్శించి మాట్లాడారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ ఓసీలకు చెందిన 30 పేద మధ్యతరగతి కుటుంబాలు నిల్వ నీడ లేక డబుల్ ఇండ్లలో జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. వారందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. లేదంటే ప్రజలందరిని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ శోభ, షాడ యాదమ్మ, ఐలయ్య, మరియా కాలనీ ప్రజలు పాల్గొన్నారు.