Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-గూడూరు
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ,ఆశ్రమ పాఠశాలలో పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలని, సంక్షేమ ఆశ్రమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సీతానగరం ఆశ్రమ పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ... పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. తక్షణమే పార్టీ పుస్తకాలు అందించి విద్యార్థులకు మంచి విద్యను అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్యప్రకాష్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు సందీప్ పాల్గొన్నారు.