Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజు కొనసాగిన నిరాహార దీక్షలు
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వీఆర్ఏల జేఏసీ జనగామ చైర్మన్ జయరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తీస్తున్న సమ్మెలో భాగంగా గురువారం జనగామ జిల్లాలో రెండో రోజు నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా కష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జయరాజు మాట్లాడారు. తరతరాలుగా వస్తున్న వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు పైబడిన వారి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం ఆ విషయాన్ని మరిచిందని, పే స్కేల్ ప్రకటించాలని కోరారు. అనంతరం జేఏసీ రాష్ట్ర కోశాధికారి శ్రీధర్‌గౌడ్ మాట్లాడుతూ.... వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పరిష్కరించి వారిలో నెలకొన్న ఆందోళనలు తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కో చైర్మన్ శ్రీధర్, శ్రీనివాస, నర్సింగ్, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.