Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమన్వయంతో చేయాలి : జిల్లా కలెక్టర్
- జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లను జిల్లా అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీిహెచ్ శివలింగయ్య ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాల యంలో ఆగస్టు 1 నుండి 8 వరకు నిర్వహించే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో డీసీపీ సీతారాంతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఆగస్టు 1 నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించే రెండవ సంవత్సర పరీక్షల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మొదటి సంవత్సరంలో 1999 విద్యార్థులతోపాటు ఒకేషనల్ విద్యార్థులు 606 మంది తో మొత్తం 2605మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. రెండవ సంవత్సరంలో 966 మంది విద్యార్థులతో పాటు ఒకేషనల్ 362 మంది విద్యార్థులు కలిపి మొత్తం పదమూడు 1328 మంది విద్యార్థులు పరీక్ష లకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రా నికి చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు సమయానుకూలంగా బస్సులను నడపాలని, పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సర పరీక్షలు రాసేందుకు 3933 మంది విద్యార్థులు హాజరవుతున్న దృష్ట్యా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు 12 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 12మంది శాఖ అధికారులు, ఇద్దరు సహాయ సూపరిండెంట్లు, మరో ఇద్దరు కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వాటి పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణ సమ యంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్‌శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తారన్నారు. పారిశుధ్యం ఏర్పాట్లను మునిసిపాలిటీ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తా మన్నారు. తాగునీటి ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ కోరారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసిందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. పరిసరాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీవో మధుమోహన్, డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ కరుణశ్రీ, విద్యుత్ శాఖాధికారి మల్లికార్జున, ఆర్ టి సి డిపో మేనేజర్ జోస్త్న, మున్సిపల్ కమిషనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.