Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌన దీక్ష
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగించాడు.. పెళ్లి చేసు కుంటానని నమ్మించి, శారీరకంగా దగ్గరై, యువతిని వివాహం చేసుకుంటానని నమ్మబలికి మోసం చేసిన యువ కుడు పరారీలో ఉన్నాడు. ఆ యువకుడిపై స్థానిక పోలిస్ స్టేషన్లో బాధితురాలు గురువారం ఫిర్యాదు చేసింది. అనంతరం యువకుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన చొక్కం లక్ష్మి రమేష్ కూలీ నాలీ చేసుకుని జీవిస్తున్నారు. వారి కూతురు చొక్కం రమ్య, అదేకులానికి చెందిన నీల గట్టయ్య, రాజమ్మ కుమారుడు నీల సందీప్ అలియాస్ సుమంత్ ప్రేమించుకున్నారు. ఈక్రమంలో యువకుడి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారని సాకుతో తప్పు కున్నాడు. ఇంతలో యువతి తల్లిదండ్రులు మరో యువ కుడితో పెళ్ళి చేశారు. ఇంతటితో ఊరుకోకుండా సందీప్ ఆ యువతిని నిత్యం వేధిస్తూ, నువ్వు రాకపోతే చనిపోతానని మభ్యపెట్టి, తన కాపురంలో కల్పించుకుని తను పెళ్లి చేసు కున్న భర్త, అత్త మామతో వాగ్వివాదానికి దిగాడు. పలు మార్లు తిరస్కించినా ఆ యువతిని బెందిరించి లాక్కెళ్లాడు. యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయగా యువకుడి తల్లిదండ్రులు, బంధువులు ఫోన్ చేసి పెళ్లి చేస్తామని, తమపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని చెప్పడంతో నమ్మి స్థానిక పోలిస్‌స్టేషన్ ఎదురుగా పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని హైదరాబాద్ వెళ్లారు. యువకుడి తండ్రి గట్టయ్య మరల ఫోన్ చేసి నీవు ఒక్కడివే రమ్మని, తనను సఖి కేంద్రంలో విడిచి పెట్టి మళ్ళీ వస్తానని చెప్పి ఫోన్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఇది గ్రహించిన బాధిత తల్లిదండ్రులు, మహిళా సంఘాల నాయకులతో కలిసి మౌన దీక్ష చేపట్టారు. తిరిగి వచ్చిన ఆ జంటను యువ కుడి బంధువులు తండ్రి, యువతితోపాటు, ఆమె తల్లి దండ్రులను బెదిరించారు. రాజకీయ పలుకుబడితో తనను మోసంచేసుందుకు యత్నిస్తున్నారని, ప్రేమించి మోసం చేసిన తనతో జీవితం సాగిస్తానని లేదంటే చావే శరణ్యమని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. మునిగెల గట్టమ్మ, మానస, విజయలక్ష్మి, గొనేల సావిత్రి, దారం రాజేశ్వరి, పిట్టల రేణుక,రమ, యాతం రాజమణి, హేమలత, హేమలత, నారగోని పద్మ, తదితరులు ఆమెకు మద్దతుగా నిలిచారు.