Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపాం
- మార్కెట్ చైర్మన్‌కు మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి హామీ
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో అసంపూర్తిగా ఉన్న మార్కెట్ కార్యాలయ భవన నిర్మాణ పనులతో పాటు మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఉన్న సివిల్ సప్లై గోదాముల మరమ్మతుకు, నూతనంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, మార్కెట్ యార్డు ప్రహరీ పెంపు, మరిపెడ సబ్ యార్డు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కోసం నివేదిక పంపామని, ప్రభుత్వ అనుమతి రాగానే పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కేసముద్రం వ్యవ సాయ మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి హామీ ఇచ్చి నట్లు తెలిపారు. గురువారం హైదరాబాదులో మార్కె టింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయితోపాటు అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడును కలిసి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అభివద్ధి పనుల విషయంపై వివరించారు. ఇప్పటికే ఆయా అభివృద్ధి పనుల అంశం పై మార్కెటింగ్‌శాఖ అంచనాలు రూపొందించి నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వ అనుమతి కోసం ప్రతి పాదనలు పంపినట్లు చైర్మన్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి రాగానే అభివద్ధి పనులు చేపట్టడానికి టెండర్లను పిలుస్తామని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిపారు. కేసముద్రం వ్యవ సాయ మార్కెట్ జాతీయస్థాయిలో ఈనామ్ విధానం పూర్తి స్థాయిలో చేస్తూ ఇటీవల ప్రధానమంత్రి చేతుల మీదుగా ఎక్సలెన్సీ అవార్డు పొందిన నేపథ్యంలో మార్కెట్ సిబ్బందికి నగదు ప్రోత్సాహక బహుమతులను అందించడానికి మార్కె టింగ్‌శాఖ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వారు రావడానికి సుముఖత వ్యక్తం చేశారని, త్వరలో సిబ్బందికి నగదు ప్రోత్సాహక బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.