Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
మారుమూల ప్రాంత నిరుపేద విద్యార్థులకు సైతం ఇంగ్లిష్ మీడియం విద్యనందించి, వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తున్నదని జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని కర్కాల గ్రామానికి చెందిన 20మంది పేద విద్యార్థులకు మంత్రి దయాకర్‌రావు ఆదేశం మేరకు దాతల సహకారంతో సమకూర్చిన సైకిళ్లను మంగళపల్లి శ్రీనివాస్ అందజేశారు. సైకిళ్లు పొందిన విద్యార్థులను స్థానిక జెడ్పీటీసీ శ్రీనివాస్ హరి పిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తీసుకెళ్లారు. ఈ సంద ర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... పేద కుటుంబాలకు చెందిన బిడ్డలు సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దష్టిలో ఉంచుకొని మంత్రి దయాకర్ రావు,జిల్లా కలెక్టర్ శశాంక, ఆర్డిఓ రమేష్, తహసిల్దార్ రాఘవరెడ్డి సహకారంతో సైకిళ్లు సమకూర్చినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా విద్యార్థులకు 100 సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుందన్నారు. వారికి నాణ్యమైన విద్యనందిం చేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7289కోట్లతో దాదాపు 26వేల ప్రభుత్వ పాఠశాలలను అభివద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా విద్యా శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. బాలికల డ్రాపౌట్ల సంఖ్య తగ్గించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం పెంచేలా కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కర్కాల సర్పంచ్ సేగ్యం సురేఖ సురేందర్, ఉప సర్పంచ్ పసులాది వెంకన్న, ఎంపీటీసీ వల్లపు గోపమ్మ మల్లయ్య, హరిపిరాల ఉన్నత పాఠశాల చ్ఎం సుధాకరాచారి, కర్కాల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పులి ముత్తిలింగం,ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంపత్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.