Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ-సంగెం
ప్రభుత్వం చెప్పినట్లుగా రైతులకు రావలసిన రుణమాఫీ సొమ్మును త్వరలో అందే విధంగా ముఖ్య మంత్రితో మాట్లాడి ఇప్పించే బాధ్యత నాది అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మండలంలోని కాపులకనపర్తి రై తు సేవా సహకార సంఘంలో గురువారం చైర్మన్ దొమ్మటి సంపత్ అధ్యక్షతన జరిగిన పంట రుణాల పంపిణీ, డిపాజిట్ల సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రజల జీవన విధానం చాలా మారిందన్నారు. రాష్ట్రం రాకముందు భ యాందోళనలో బతికేటోళ్లం. రాష్ట్ర సాధనలో మ నం చేసిన ఉద్యమం తెలంగాణ ప్రాంత ప్రజల బతు కులు మారడం కోసం కొట్లాడినం. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్ల, నిధులు, నియామకాలు కోసం కొట్లాడినం. మన నాయకుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాదించుకున్నామన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లా డుతూ ఉమ్మడి జిల్లా లో సంగెం మండలం ఆదర్శవంతమైన మండలమని అన్నారు. రైతు సేవా సహకార సంఘం కాపుల కనపర్తి 1978 లో 300 మంది సభ్యులతో ఈ సంఘం స్థాపిం చబడిందన్నారు. నేడు 4793 మంది సభ్యుల తో ఉంది.ఈ సంఘంలో ఉన్న సమస్యలు సీఎం కేసీ ఆర్ దష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింద న్నారు. త్వరలోనే ఈ సంఘానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి తప్ప కుండా కృషి చేస్తానని తెలిపారు. రైతులు బ్యాంకుల చుట్టూ రుణాలకోసం తిరిగే రోజు లు పోయి బ్యాం కులే రైతుల కోసం తిరిగే రోజులు సీఎం కేసీఆర్ తీసు కొచ్చారన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి వారి అభివద్ధికి సీఎం కేసీ ఆర్ కృషి చేస్తు న్నారన్నారు. సొసైటీపై నమ్మకంతో మళ్ళీ రూ.19 కోట్లు ఈ సంవత్సరం పంట రుణాల సౌకర్యం కల్పిం చిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు యాజమాన్యానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కళా వతి, జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి, జిల్లా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ సంజీవరెడ్డి, జిల్లా సమన్వయ సమితి సభ్యు లు పులుగు సాగర్‌రెడ్డి, జిల్లా వ్యవ సాయ అధికారి ఉషోదయాళ్, ఐఓబి రీజినల్ మేనేజర్ అశోక్, కాపులకనపర్తి ఎంపిటిసి సుతారి బాలకష్ణ, మార్కెట్ డైరెక్టర్ పసునూరు సారంగపాణి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కంద కట్ల నర హరి, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, తహ సీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీడీవో మల్లేశం, బ్యాంకు డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.