Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41 రోడ్లు, 89.15 కిలోమీటర్ల రోడ్ల ధ్వంసం
- 423 ఇల్లు పూర్తిగా, పాక్షికం దెబ్బతిన్నాయి
- నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో నలుగురు సభ్యుల కేంద్ర బృందం కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి పార్తిభన్, డెరెక్టర్ ఆఫ్ జూట్ డెవలప్మెంట్, కె.మనోహరన్, కంద్ర జలసంఘం డెరెక్టర్ రమేష్‌కుమార్, జాతీయ రహదారుల అబివృద్ధి సంస్థ ఎస్ ఈ శివకుమార్ కుష్వాహలు ఇటీవల కురిసిన భారీ వర్షాల కు దెబ్బతిన్న పంటలు, ఇళ్లు,రహదారులను వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు గురువారం పర్య టించారు. కేంద్ర బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటన అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల ఫొటోలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య వివరించారు. ఈ నెల 10 నుండి నేటికి 956.2 ఎంఎం 9 మండలాల్లో వర్షం కురిసిందని కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు. గోదావరి నదికి ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. జిల్లాలో వరి 1060 ఎకరాలు, పత్తి 3895, మిర్చి 982 ఎకరాలు మొత్తం 5937 ఎకరాల పంట నష్టం జరిగిం దని అన్నారు. వరదల వల్ల 84 గ్రామాలు, 34 లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా నష్ట పోయాయని వివరించారు. వరదలు వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. నాలుగు జంతువులు చనిపోయాయని తెలిపారు. 13 చెరువులు దెబ్బతిన్నాయని, దొడ్ల బిడ్జీ, హనుమంతుల వాగు పాక్షికంగా దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు. పీఆర్ రోడ్లు 17, ఆర్ అండ్ బి రోడ్లు 5, టి డబ్ల్యూ ఈ రోడ్లు 19 మొత్తం 89.15 కిలోమీటర్ల రోడ్డు దెబ్బతిన్నాయని వివరిం చారు. 34 ఇండ్లు శిథిలమై, 304 ఇండ్లు పాక్షికంగా, 85 గుడిసెలు దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు. 33 కెవి 19, 11 కెవి 41, ఎల్టీ 106, డిటిఆర్ విద్యుత్ పోల్స్ దెబ్బ తిన్నాయన్నారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్లు హను మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు హనుమంతు, గోపి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్, ఆర్డీవో రమా దేవి, ఏఎస్పి సుధీర్ ఆర్ కేకన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.