Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లర్లు, బీమ్‌లకు చిల్లులు..
- స్లాబ్ నుంచి వర్షం నీరు లీకులు
- ప్రయాణికులకు ప్రాణసంకటం..పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకుంది. పిల్లర్లకు, బీమ్‌లకు, స్లాబ్లకు చిల్లులు పడి ప్రమాద స్థితికి చేరుకొంది. కొన్నేండ్లగా బస్ స్టేషన్ శిథిలా వస్థకు చేరుకొన్నా మరమ్మతుతో సరిపెడుకుంటూ ఆర్టీసీ ఇంజనీరు అధికారులు చేతులెత్తేస్తున్నారు. స్లాబ్‌కు, పిల్ల ర్లకు, బీమ్‌లు పెచ్చులూడుతూ చిల్లులు పడిన ప్రదేశంలో కొన్నేండ్లగా తాత్కలికంగా ప్లాస్టింగ్ చేసి వొదిలేస్తు వస్తు న్నారు. కొన్నాళ్లకే అదే స్లాబ్‌కు తిరిగి లీకులు ఏర్పడి వర్షం నీరు పడి బస్‌స్టేషన్ ఆవరణమంతా బురదమయంగా మారుతుంది. ఇటివల వారం రోజుల పాటు నిరవధికంగా కురిసిన వర్షంతో చిల్లుల్లో నుంచి పడిన వర్షపు నీటితో ప్రయాణికులు బంబెలెత్తారు. ఈ బస్‌స్టేషన్‌ను దాదాపు 40 యేండ్ల క్రితం నిర్మించారు. క్రమేపి భవనం శిథిలావస్థకు చేరుకొంటూ వస్తుంది. చిల్లులు పడిన ప్రదేశం వద్ద చేపట్టిన మరమ్మతుల పెచ్చులూడి పలు ప్రయాణికులు గాయాలపాలైన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ప్రస్తుత పరిస్థితితో డిపో కార్యాలయ గదులు కూడా నిర్వహనలో లేకుండా పోయాయి. ఇటివల కార్యాలయంలో తాత్కలిక మరమ్మత్తు పనులు చేపట్టారు. స్లాబ్‌కు చిల్లులు పడిన ప్రదేశంలో మరమ్మతులు చేయడం కొన్నాళ్లుగా పరిపాటిగా మారింది. ఈ మరమ్మత్తులతో కాంట్రాక్టర్లు లాభపడ్డారే తప్పా శాశ్వత పరిష్కారం దొరక లేదు. కొద్ది రోజులకే మరమ్మత్తులు చేసిన వద్ద నుంచే పెచ్చులూడుతూ కిందపడడం పరిపాటిగా మారింది. డిపో ఆవరణంలోని పలు గదులు కూడా ఇదే స్థితిలోనే చేరుకొన్నాయి. ఒక రకంగా ఈ భవనాలకు మొత్తంగా జీవిత కాల పరిమితి ముగిసిట్టుగానే కన్పిస్తుంది. ఇంతటి అధ్వాన్నంగా మారిన ఈ బస్ స్టేషన్ ద్వారం నుంచి ప్రయాణికుల రాకపోకలు కొన్నేండ్ల క్రితమే నిలిచి పోయిం ది. ఈ పరిస్థితిలో బస్ స్టేషన్‌లోని ప్లాట్ ఫారమ్‌ల వద్దకు బస్‌ల ద్వారం నుంచే ప్రయాణికులు వెళ్లాల్సి వస్తుంది. బస్‌లకు, ఎదురుగా, వెనుక భాగం నుంచి ప్రయాణికులు వెళ్లడం వల్ల ప్రమాదాలు కూడ ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండేండ్ల క్రితం బస్ స్టేసన్‌లోని ఫ్లాట్ ఫారం నుంచి డ్రైవర్ బస్‌ను వెనక్కు తీస్తుండగా ఓ మహిళకు ఢకొీని అక్కడిక్కడే మృతి చెందిన విషాధ సంఘటన కూడా చోటుచేసుకొంది. మొత్తంగా ఈ బస్‌స్టేషన్ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని ప్రాణసంకటంగా మారిందని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయంగా మారింది. ఇప్పటికైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించి శిథిలావస్థకు చేరుకొన్న ఇట్టి భవనాన్ని కూల్చేసి అధునాత పద్థతిలో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
సివిల్ ఇంజనీరు అధికారులకు నివేదించాం
- బాబు నాయక్, డిపో డీఎం
బస్ స్టేషన్ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంపై ఆర్టీ సీ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లాం. ఇటివల డిపోను ఆర్ఎం సందర్శించగా ఈ పరిస్థితిని దృష్టికి తీసుకెళ్లాం. శిథిలావస్థకు చేరుకోవడంపై ఆర్టీసీ సివిల్ ఇంజనీర్లకు నివేదించాం. వారు సందర్శించి ఇటివల డీఎం కార్యాల యంలో మరమ్మత్తు పనులు ప్రారంభించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక బస్ స్టేషన్ ప్రాంగణాన్ని కూడా మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. ఈ సమస్యకు ఆర్టీసీ యాజమాన్యమే శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది.