Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ భద్రాచలం ఇన్చార్జి
- డాక్టర్ తెల్లం వెంకట్రావు
నవతెలంగాణ-వెంకటాపురం
గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం మండ పరిధిలోని గోదావరి వర దల్లో నీట మునిగిన ప్రాంతాలను ఆయన పర్యటిం చారు. తక్షణ సాయం క్రింద ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు, 20 కేజీల బియ్యం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. పూర్తిగా లోతట్టు ప్రాంతాల ప్రజలు వాళ్ల ఇష్టం మేరకు ఎత్తైన ప్రాంతాల్లో ఇల్లు కట్టించి ఇస్తా మన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంప రాంబాబు, జడ్పిటిసి పాయం రమణ, సర్పంచులు శ్రీదేవి, గంగ, సూరిబాబు, ఆదిలక్ష్మి, సారయ్య, రాధా,ఎంపీటీసీలు బిక్షపతి, సాంబశివరావు, యువ నాయకులు బాలసాని వేణు, ప్రధాన కార్యదర్శి మురళి, అధికార ప్రతినిధి దామోదర్, సీనియర్ నాయ కులు బాలసాని శ్రీనివాసరావు, వేల్పూరి లక్ష్మీ నారాయణ, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మాధురి, టౌన్ ప్రెసిడెంట్ నగేష్, ఉపాధ్యక్షులు జి నాగేశ్వరరావు, శాంతమూర్తి యాదవ్ ప్రసాదు పాల్గొన్నారు.