Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఐదేళ్లలోపు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిం చాలని సర్పంచ్ లత నర్సింగరావు అన్నారు. మండల ప్రాథమిక పాఠశాల బరిగలపల్లిలో పాఠశాల యాజ మాన్య కమిటీ సమావేశం పాఠశాల ప్రధానో పాధ్యాయులు కొత్త పల్లి పోషన్న అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడుతూ మనం మన ఊరు బడిని బలోపేతం చేయడానికి తప్పకుండా ప్రభుత్వ పాఠ శాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపు నిచ్చారు. ఎస్ఎంసి ఛైర్మన్ కాయిత రమేష్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైనందున గ్రామంలోని 5వ తరగతి వరకు గల విద్యార్థులు అందరూ తప్పకుండా మన ఊరు బడి లోనే చేర్పిం చాలని అన్నారు. చివరగా ఉచిత పాఠ్య పుస్తకాలను, నోట్ బుక్లు సర్పంచ్, ఛైర్మన్ అందించారు. కార్యక్ర మంలో సహచర ఉపాధ్యాయులు పోరిక రతన్ సింగ్, ఉపసర్పంచ్ వైనాల రమేష్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.