Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయాలి : సీపీఐ(ఎం) జనగామ
- జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
ఈనెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మాజీ ఎమ్మెల్యే ఏసీరెడ్డి నరసింహారెడ్డి 30వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏసిరెడ్డి నరసింహారెడ్డి 30 వ వర్ధంతి సభ కడపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం, అంటరానితనం, అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో మహా ఉద్యమాన్ని నడిపిన వీరుడు ఏసిరెడ్డి అని కొనియాడారు. నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఆలేరులో ప్రదర్శన నిర్వహిస్తున్న సంద ర్భంలో నైజాం పోలీసుల కాల్పులలో తుపాకీ గుండు తగిలి గాయమైనా నైజాంను బెదిరించిన మహనీయుడు ఏసి రెడ్డి అని తెలిపారు. జనగామ తాలూకాలో సీపీఐ(ఎం) ఉద్యమ నిర్మాతగా ఉంటూ 1985 నుండి 1990 వరకు జనగామ ఎమ్మెల్యే గెలిచి నిస్వార్ధంగా సేవలందించాడన్నారు. కమ్యూ నిస్టు పార్టీ నాయకత్వంలో నాడు ప్రజలు పోరాడి సాధిం చుకున్న భూములను నేడు ప్రాజెక్టుల పేరుతో ప్రజల నుండి భూములు లాక్కొని కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రశ్నిస్తున్న వారిని జైల్లో పెడుతూ పాషవిక పాలన సాగిస్తున్నదని విమర్శించారు. నిత్యవసర ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. విద్య వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజల శ్రమను దోచుకుంటున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ఆర్టీసీ చార్జీలు భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు, విద్యుత్తు చార్జీలు, మద్యం రేట్లు విపరీతంగా పెంచి ప్రజలపై అదనపు భారాలు వేస్తోందన్నారు. రాబోయే రోజులలో ఏసిరెడ్డి స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఉద్యమి స్తామని హెచ్చరించారు. 28వ తేదీన నిర్వహించే ఏసీరెడ్డి వర్ధంతి సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం , సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్, రాష్ట్ర సీనియర్ నాయకులు గంగసాని రఘు పాల్గొననున్నట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజాస్వామికవాదులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకటరాజం, ఇర్రి అహల్య, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు, బూడిది గోపి, జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్. జిల్లా కమిటీ సభ్యులు ఎండీ అజారుద్దీన్, తేజావత్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.
60 ఫీట్ల రోడ్డును పూర్తి చేయడంలో నిర్లక్ష్యం
జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ ఏరియా నుండి హైదరాబాద్ రోడ్డుకు లింక్ చేస్తూ వేస్తున్న 60ఫీట్స్ రోడ్డు పనులు సంవత్సరం గడిచినా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తు న్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విమర్శిం చారు. ఆదివారం 60 ఫీట్ల రోడ్డును పరిశీలించి ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం జూన్లో పనులు ప్రారంభించి పూర్తి చేయలేదన్నారు. రోడ్డు కోసం చుట్టు పక్కల ఇండ్లను సెంట్పాల్ స్కూల్ గోడను కూల్చివేశారని, రైతుల భూములను , పేదల ప్లాట్లను బలవంతంగా గుంజుకొని హడావుడి చేసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రోడ్డు పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్లపై ఉన్న కంకర కుప్పలతో జారిపడి గాయాలపాలవుతున్నారన్నారు. రోడ్డు పనులు పూర్తి చేయకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, ఎండీ అజార్, కళ్యాణం లింగం మంగ బీరయ్య, రాములు, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.