Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం యువత ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు హన్మ కొండ శ్రీధర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కల్వాల సుధీర్ అన్నా రు. ఆదివారం డీవైఎఫ్ఐ పట్టణ ప్రథమ మహాసభ గడ్డమీది బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసింద న్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తూ ఉద్యోగాలను కొల్లగొట్టిందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను హ రించేసిందని విమర్శించారు. కేంద్ర మంత్రులు నిరుద్యో గులను కించపరిచడం సిగ్గుచేటన్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా యువతకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై పోటి పడుతూ భారాలు మోపుతుందని దుయ్యపట్టారు. ఈ క్రమంలో యువత పోరాటాలతో పాలకులను ఎదుర్కొవాలని సూచించారు.
డీవైఎఫ్ఐ పట్టణ నూతన కమిటీ ఎన్నిక
డీవైఎఫ్ఐ నూతన అధ్యక్షులుగా గడ్డమీద బాలకృష్ణ, కార్యదర్శి కొలకటి అనిల్, ఉపాధ్యక్షులుగా నిమ్మలబోయిన రమేస్, పసునూటి మహేష్, సహాయ కార్యదర్శి కొలువుల గోపి, కార్తీక్ ఎన్నుకైయ్యారు. ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులుగా జెట్టి రాజు, రమేష్, కర్ణాకర్, దిలిప్, రాజేశ్, ప్రజా సంఘ నాయకులు గుజ్జుల ఉమ, అనంతగిరి రవి తదితరులు పాల్గొన్నారు.