Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మధు, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. ఎంపీపీ చేపూరి మౌనిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాత గణేష్, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి గౌడ్, వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లాల్ సింగ్, రాష్ట్ర లారీ అసోసియేషన్ అధ్యక్షుడు యలామద్ది రవి, టీిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు తిరుమల ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి సక్కు సత్తిరెడ్డి, ఆత్మ కమిటీ జిల్లా సభ్యులు ఏనుగుల ఐలయ్య, యాదవ్ జిల్లా ఆత్మకంటి సభ్యులు బానోత్ శ్రీను నాయక్, ప్రచార కార్యదర్శి పరిష్క రాజు, ఉపేందర్, యూత్ అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి ఉప్పలయ్య, జిల్లా నాయకులు సోమిరెడ్డి, ఎంపీటీసీ తిరుమల శైలజ రెడ్డి, సర్పంచులు కోటమ్మ, నాయకులు అరుణ్ యాదవ్, వీరభద్రం, వెంకన్న, శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.