Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి సంక్షేమంలో పాలకుర్తి ఆదర్శం
- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
టీిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ నేటి యువతకు స్ఫూర్తి అని రాష్ట్ర పంచాయ తీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఆదివారం మండలం లోని గూడూరులో మంత్రి ఎర్రబెల్లి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గూడూరు ఈరవెన్ను గ్రామాల మధ్య రహదారికి ఇరువైపులా హరితహారంలో జిల్లా కలెక్టర్ సీిహెచ్ శివలింగయ్య, గ్రామస్తులు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి 20వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లా డుతూ రాష్ట్రానికి కాబోయే సీఎం కేటీఆర్ అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తండ్రికి తోడుగా ఉద్యమంలో పాల్గొని సాధించు కోవడంలో ముందు వరసలో కేటీఆర్ నిలిచాడని తెలి పారు. సాధించుకున్న రాష్ట్రం ఐటి రంగంలో దూసుకుపోతుందని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అన్నదానాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా కార్యకర్తలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. మంత్రి కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరానికి ఎన్నో ఐటి కంపెనీలు, మెడికల్ ఫార్మా కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పాలకుర్తి, బొమ్మెర, వల్మిడి గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు సుమారు 25 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. పర్యాటక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని, గూడూరు నుండి దేవరుప్పుల, గూడూరు నుండి రఘునాథపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేప ట్టామని తెలిపారు. హరితహారంలో మొక్కలు నాటి హరిత తెలంగాణగా దిద్దేందుకు సీఎం కేసీఆర్ కార్యోన్ముఖుడు అయ్యాడని తెలిపారు. పచ్చదనంతో సమద్ధిగా వర్షాలు కురవడం వల్ల రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నీటితో జలకళలా డుతున్నాయని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా సంరక్షించుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీఏ పీడీ గూడూరు రామ్‌రెడ్డి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండీ మదార్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంత రావు, పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, గూడూరు సర్పంచ్ మంద కొమురయ్య, ఎంపీటీసీ చెరుపెల్లి రాజేశ్వరి విజరు కుమార్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, ,మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, జిల్లా ఎంపీటీసీల పోరం గౌరవ అధ్యక్షుడు మాటూరి యాకయ్య, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ మేడారపు సుధాకర్, ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మారుజోడు సంతోష్, ఉపసర్పంచుల ఫోరం మండల గౌరవ అధ్యక్షుడు కోస్న రామిరెడ్డి, ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ కన్వీనర్ చిక్కుడు రాములు, తదితరులు పాల్గొన్నారు.