Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
'రోల్ ఆఫ్ మిషిన్ లర్నింగ్ ఇన్ ఫార్మసిటికల్ ఇండిస్టీ' పుస్తకం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుందని బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. మండ లంలోని లక్నెపెల్లిలో బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ కళాశాలలో ఫార్మా సిటికల్ అనాలసిస్ విభాగాధిపతి టీ.మనీష్ కుమార్ రచించిన 'రోల్ ఆఫ్ మిషిన్ లర్నింగ్ ఇన్ ఫార్మా సిటికల్ ఇండిస్టీ' అనే పుస్తుకాన్ని ఆవిష్క రిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకంలోని విశిష్టతను తెలియపర్చుతూ ప్రశం సించారు. ఈ పుస్తకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ జీ.రాజేశ్వరెడ్డి, బిప్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.శ్యాంసుందర్, డాక్టర్ రవి, రాజ నరేందర్, డీన్ ఆఫ్ అకాడమిక్ పీ.నారాయణ, ఏవో ఎస్.సురేష్ తదితరులు పాల్గొన్నారు.