Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కళ్లెపెల్లి ప్రణయదీప్, దళిత బలహీన వర్గాల ప్రజాస్వామ్య సమితి వ్యవస్థాపకులు అందె రవి డిమాండ్ చేశారు. ఆర్అండ్బీ గెస్టు హౌజ్ ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపటడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మహాకవి గుర్రం జాషువా 51 వర్థంతిని నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ దీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాకి నాడలో నాడు నిర్వహించిన బీజేపీ జాతీయ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంటూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని హామీనిచ్చిందని తెలిపారు. ఎనిమిదేండ్లయినా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవే పెట్టకుండా అన్యాయం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీపై ఏమాత్రం బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టకుంటే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహిళా సమాఖ్య మిట్టపెల్లి రాధిక, జిల్లా కన్వీనర్ అంబేద్కర్ నగర అధ్యక్షులు మునిగే యాకూబ్, లావణ్య, రజిత, కొండపెల్లి లావణ్య, సుమలత, సమ్మక్క, సారక్క, స్వాతి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.