Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కేటీఆర్‌ను విమర్శించేటోళ్లు మూర్ఖులని, ఇందిరా గాంధీకి పుట్టి నోళ్లు ఎంతటి అసమర్ధులో తెలు సునని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నియోజక వర్గంలోని చిల్పూర్ మండలం నష్కల్ క్రాస్ వద్ద స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అధ్యక్షతన కుడా చైర్మన్ ధర్మ రాజు ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డితో కలిసి ప్రధాన జాతీయ రహదారికి ఇరువైపులా మూడు వరుసలతో ఆరేపల్లి నుంచి కళ్లెం వరకు 50లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. యువనేత కేటీఆర్ ఆదేశానుసారం ఎలాంటి ఆడంబరం, అట్టహాసం లేకుండా, వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సేవ చేస్తూనే మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో యువనేత కేటీఆర్ హైద్రాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో పాటు, బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. రాబోవు కాలంలో సీఎం కేటీఆర్ అని ధీమా వ్యక్తంచేశారు. కేటీఆర్ స్వల్ప గాయంతో బాధపడుతున్న కారణంగా కేటీఆర్ త్వరగా కోలుకోవాలని, ఎమ్మెల్యే రాజయ్య చేసిన పూజల పట్ల, పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. యూత్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న కేటీఆర్ రాజకీయ రంగంలో అగ్రగామిగా నిలవాలని, పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎంపీపీ ి సరితబాలరాజు, చిల్పూర్ దేవస్థాన కమిటీ చైర్మెన్ పొట్లపల్లి శ్రీధర్ బాబు, టీఏ అనిల్, డీఎఫ్ఓ నాగ భూషణం, ఎఫ్ఆర్ఓ మురళీధర్, బిక్షపతి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు..