Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మండలంలోని చర్లపాలెం బీసీ హాస్టల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జెడ్పీటీసీ, జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రభుత్వ వసతి గహాల్లో ఉంటున్న స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యా సంవత్సరం మొదలైనప్పటినుండి వసతి గృహాల్లో చేరుటకు అవకాశం ఉందని, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు భోజనం పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టల్ వార్డెన్ స్థానికంగా ఉంటూ సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో చర్లపాలెం ఎంపీటీసీ ధర్మారావు కిరణ్, వార్డెన్ గంటా భాస్కర్, ధర్మారావు యాకయ్య, రాంమల్లు, శ్రీనివాస్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.