Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కేలోత్ సాయికుమార్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో మయూబ్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. దాదాపు బడులు తెరుచుకొని రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. ప్రయివేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పెంచిన బస్సు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, యూనిఫామ్స్ అందజేయాలని అన్నారు. ప్రాజెక్టుల మీద ఉన్న సోయి విద్యా రంగంపై లేదని హితపు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంస్పందించి విద్యార్థులకు పుస్తకాలు అందజేయాలని అన్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి గుగులోత్ సూర్య ప్రకాష్, జిల్లా నాయుకులు బానోత్ ఉపేందర్, మండల నాయకులు ఉమేష్, చందు, సందీప్, గణేష్, శ్యామ్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.