Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో కుంటుపడిన విద్యా వ్యవస్థ
- చదువులు సాగే క్రమంలో వర్షాల బీభత్సం
- ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పటికీ కొనసాగని విద్యాబోధన
నవతెలంగాణ-వరంగల్
నాలుగు ఏళ్ల నుండి కరోనాతో విద్యావ్యవస్థ, కుంటుపడిపోయింది. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభ సమయంలోనే ప్రకతి వైపరీత్యాలతోఎడతెగని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. రవాణా వ్యవస్థ అంతారాయం కలుగడంతో విద్యా వ్యవస్థకు ఇప్పటికీ పలు మార్లు ప్రభుత్వం సెలువులు ప్రకటించడంతో ఈ ఏడాదైన చదువులు సజావుగా సాగుతాయో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయి. భారీ వర్షాలతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు తడిసి ముద్దయ్యాయి. మరి కొన్ని ప్రభుత్వ పాఠ శాలలు కూలిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొంతమంది విద్యార్థులు విద్యు దాఘాతంతో మత్యువాత పడడం, చాలా చోట్ల శానిటేషన్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం చాలా ఇబ్బందులకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక వైపు విజృంభిస్తున్న కరోనా వైరస్, మరో వైపు భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులతో అతలా కుతలం అవుతున్న సంఘటనలు గోచరిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో చాలాసార్లు పాఠశాలలకు సెలవులు ప్రకటిం చడం విద్యార్థులు ఇళ్లకే పరిమితమై ఇంటివద్ద ఉంటూ సెల్ఫోన్లలో వీడియో గేములు, ఇన్స్ట్రాగేమ్, ట్విట్టర్,ఫేస్ బుక్, వాట్స్ అప్‌లో చాటింగులు చేస్తూ సమయమంతా వధా చేసుకుంటున్నారు. అంతుచిక్కని వైరస్‌తో ప్రపంచం అతలాకుతలమైన తరుణంలో విద్యావ్యవస్థ అప్‌లైన్ తరగతులకు అంతరాయం కలుగుతున్నది.