Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే చల్లా
నవతెలంగాణ-సంగెం
మొండ్రాయిని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని వివిధ పార్టీలకు సంబంధించిన అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మండలంగా ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. గ్రామంలో జరిగే రోడ్డు వెడల్పు పనులకు అందరూ సహకరించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచిం చారు. రోడ్డుపై, ఏర్పడ్డ గుంతలను వెంటనే పూడ్చాలని సర్పంచ్ కుమారస్వామికి సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, జెడ్పిటి సి గూడ సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, మండల తెరాస అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, టీఆర్ఎస్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీలు కొనకటి రాణి మొగిలి, నరసింహస్వామి గవిచర్ల సర్పంచ్, దొనికెల రమా శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు మన్సూ ర్ అలీ, మొండ్రాయి వివిధ పార్టీల అధ్యక్షులు అనుముల ప్రతాప్, బాలకృష్ణ, చంద్రమౌళి, టీఆర్ఎస్ కార్యదర్శి పరికి యాకయ్య, వార్డు సభ్యులు విజరు పరికి ఎలీషా, ఐలయ్య, వీరస్వామి,రవి,రాజు,ప్రవీణ్, మురళి, రవికమార్,సంపత్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.