Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
నవతెలంగాణ-వర్ధన్నపేట
మానవ శరీరంలోని అవయవాల దానంతో ఆపదలో ఉన్న ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపవచ్చని వర్ధ న్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్బంగా సోమవారం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవన్‌దాన్ పథకం ద్వారా చేపట్టిన అవయవ దాన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందాన్నరు. 300 మంది యువతి యువకులు అవయవ దానం చేసేం దుకు ముందుకు వచ్చి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి మర ణాంతరం కళ్లు, గుండె, కాలేయం, మూత్ర పిండాలు, ఊపిరి తిత్తులు, క్లోమం దానం చేయవచ్చు అన్నారు. ఇలా ఒక మనిషి అవయవదానంతో మరో 8 మందికి జీవం పోయొచ్చు అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఇతరత్రా ప్రమా దాల్లో కోల్పోయి ఆపదలలో ఆసుపత్రిలో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి చేయూతని అందించేందుకు యువత, స్వచ్ఛం ద సంస్థలు, అవగాహన కలిగిన ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. 300 మంది అవయవ దానంతో 2400 మంది ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొ న్నారు. కార్య క్రమంలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పాల్గొన్నారు.