Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
8 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో అన్నదాత రైతన్నల పరిస్థితి అధ్వానంగా మారిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిం చా రు. సమావేశానికి ముఖ్య అతిథిగా సత్తిరెడ్డి హాజ రై మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్న పరిస్థితి కడు దయ నీయంగా మారిందని అన్నదాత రైతన్న కష్టానికి సరైన ధరను ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుండి విస్తా రంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వం కలు, చెరువులు నిండి వరదలై పారుతు న్నాయ న్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందిం చి పంట కాలువల గండ్ల వలన నష్ట పోయిన రైతుల భూముల్ని సర్వే చేయించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించి వెంటనే ప్రత్యేక ఫండ్ ద్వారా గండ్లను పూడ్చి, నష్టపోయిన రైతులను ఆదు కోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కణతల నాగేందర్రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాం త్, సీనియర్ నాయకుడు పాశం మాధవ రెడ్డి, మాజీ అధ్యక్షులు కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ గోపి దాసు ఏడుకొండలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్య క్షులు చింత క్రాంతి, జంపాల చంద్రశేఖర్, బొల్లు కుమార్, కుబ్బు తదితరులు పాల్గొన్నారు.