Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
రాష్ట్ర ప్రభుత్వం దళితుల సమస్యలను పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా కార్య దర్శి అరూరి కుమార్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం కేవీపీఎస్ మండల కమిటీ సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సమావేశానికి పోడేటి దయాకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కుమార్ విచ్చేసి మాట్లాడుతూ దళిత సమ స్యలను పట్టించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అన్నారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్ను కున్నారు. కెవిపిఎస్ మండల అధ్యక్షుడుగా జేరుపోతుల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా పోడేటి దయాకర్, ఉపాధ్యక్షులుగా వల్లందాస్ ఐలయ్య, సహాయ కార్యదర్శులుగా హనుమకొండ రాజు, జెడి రాజేంద్రప్రసాద్, గౌరారపు భాస్కర్, తాటికాయల నరస య్య, తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమం జిల్లా కమిటీ సభ్యులు ఇమ్మడి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మాదాసి యాకుబ్, సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు.