Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
- అలంకానిపేట 30 కుటుంబాలు కాంగ్రెస్లో చేరిక
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
టిఆర్ఎస్ పార్టీ దళితులకు దళితబంధు పథకం ఇస్తామని చెప్పి తమ పార్టీలోకి చేర్చుకొని కం డువాలు కప్పడం సిగ్గుచేటని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఏఐ సిసి సభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని అలంకాని పేటకు చెందిన 30 కుటుంబాలు టిఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి దొంతి మాధవ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బ్రోకర్లు మాయమాటలు చెప్పి పథకాలను ఆశ చూపి నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుం టున్నారని ఎక్కువ రోజులు వారి ఆటలు సాగమన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క యువకుడు కషి చేయాలని పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో గుంటుక మల్లయ్య, యాకయ్య, కొమురయ్య, ఉప్పరయ్య, శ్రీను, వెంకన్న, మాదాసు సారంగం, చీకటి నరసయ్య, కర్పూరపు వెంకన్న, కర్పూరపు అశోక్, జంపయ్య, రెడ్యానాయక్ తండా గ్రామ పంచాయితీ ఉపసర్పంచ్ అంగోత్ శంకర్ తదితరులు ఉన్నారు.కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,పెండెం రామానంద్, మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, పెండ్యాల హరి ప్రసాద్, కన్వీనర్ కొత్తపెళ్లి రత్నం, నాయకులు సాయికష్ణ, రఘు, లక్ష్మణ్,పొలిశెట్టి భాను ప్రకాష్,ఈదునూరి దిలీప్,బండి శివ మండల,పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్, పాల్గొన్నారు.