Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికులు, కర్షకులు ప్రతిఘటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు పిలుపునిచ్చారు. సోమవారం మూడు సంఘాల సంయుక్త సమావేశం మహుబూబాద్ జిల్లా కేంద్రంలోని జగన్నాథం భవన్ల్లో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ... అధిక ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలో కాళీ పోస్టులన్నింటిని భర్తీ చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఆహార భద్రత, ప్రభుత్వ వైద్యాన్ని పటిష్ట పరచాలన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని, రైతు రుణమాఫీ చేయాలని 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు ఒకటి నుండి సెప్టెంబర్ 5 వరకు దశలవారీగా నిర్వహించే ఆందోళన పోరాటాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మండ రాజన్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కుంట ఉపేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుర్ర మహేష్, వంగూరు వెంకటేశ్వర్లు, బాణాల రాజన్న, చింతల భిక్షపతి, ఉప్పనపల్లి శ్రీనివాస్, చేపూరి గణేష్, తేలూరి వీరభద్రం, బ్రహ్మచారి, తోట సోమన్న తదితరులు పాల్గొన్నారు.