Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోమవారం సెలవు రోజున వ్యవసాయ పనులు చేసిన తస్లీమా
నవతెలంగాణ-ములుగు
బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సోమ వారం సెలవు కావడంతో ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఎప్పటిలాగే వ్యవసాయ పనులకు వెళ్ళారు. వెంకటేశ్వర్లపల్లిలో తోకల లక్ష్మి-రాజిరెడ్డి దంపతుల వ్యవసాయ పొలం లో ట్రాక్టర్‌తో బురద కొట్టి, గొర్రు పట్టి జంబు కొట్టా రు. మహిళ కూలీలతో కలిసి నాటు వేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై మక్కువతో సెలవు రోజున ప్రతిసారి రైతులకు చేదోడు వాదోడుగా తస్లీమా నిలు స్తుంటారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ సమ స్తానికి అన్నం పెట్టే రైతన్న కష్టం తనకు తెలుసునని, మనకు అన్నం పెట్టడం కోసం ఎండనక, వానక ఆరుగాలం కష్టించి పంట పండించే రైతులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని తస్లీమా కోరారు. కూలీ పని చేసినందుకు తస్లీమాకు రూ.500 కూలీ డబ్బులు చెల్లించారు. తనకు ఇచ్చిన కూలీ డబ్బులను మరో నిరుపేద కూలీకి తస్లీమా అందజేశారు.