Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి బస్టాండ్ నిరుప యోగంగా ఉండి ఏండ్లు గడుస్తున్నప్పటికీ పాలకులు పట్టిం చుకోవడం లేదని, ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టి బస్టాండ్‌ను పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న డిమాండ్ చేశారు. సోమవారం బస్టాండ్‌ను సందర్శించి పరిశీలించి ఆయన మాట్లాడారు. పాలకుర్తిలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బస్టాండ్ నిర్మా ణానికి దాతలు భూదానం చేయడంతో సుమారు 30 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి బస్టాండ్ నిర్మించిందని తెలిపారు. ఉన్న బస్టాండ్ నిరుపయోగంగా ఉండడంతో ప్రయాణికులు చౌరస్తాలొ రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రయా ణికులకు అందుబాటులో మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజల ఇబ్బందులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆరోపించారు. నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ కుటుంబ కలహాలు, భూతగాదాల పంచాయతీలకు, మందుబాబులకు అడ్డాగా మారిందన్నారు. బస్టాండ్ లేకపోవడంతో బస్సులు రోడ్లమీద ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి దాపు రించిందన్నారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపై నిరీక్షించే పరిస్థితి ఉందన్నారు. రాజీవ్ చౌరస్తాలో కనీసం నీడ లేని పరిస్థితి ఏర్పడిం దన్నారు. బస్సులను బస్టాండ్ కు వెళ్లేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాలని, బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం కనీస సౌకర్యాలు కల్పించి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్‌ను పునరుద్ధరించకుంటే దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో బాణాల వెంకన్న, దండంపెళ్లి సోమన్న, మల్పరాజు నరేష్, ఎండీ పాషా, ఎండీి కాసిం, తదితరులు పాల్గొన్నారు.