Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ కార్యదర్శి మహ్మద్ ఆయుబ్
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన జిల్లాల పర్యటన విహారయాత్రలా సాగిందని పీసీసీ కార్య దర్శి మహ్మద్ ఆయుబ్ విమర్శించారు. సోమవారం వరంగల్ తూర్పులోని అబ్ను స్ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరం గల్, ములుగు, భద్రాద్రి జిల్లాలలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం వారికి తక్షణ సహాయం, నిత్యావసర సరుకుల పంపిణీ చేయకపోవడం దారుణ మన్నా రు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తన జన్మదిన వేడుకలు జరుపవద్దని మంత్రి కేటీఆర్ కోరిన వరంగల్ జిల్లా నాయకులు మా త్రం టిక్కెట్లు రావా లని గుడి మె ట్లు ఎక్కడం, కేటీఆర్ ఆడియో విడుదల చేస్తూ, పోటీపడి మరీ వేడుకలు జరి పారన్నారు. కాంగ్రెస్ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. మండిబజార్లో ఇటీవల ఇంటిగోడ కూలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన ఎర్రబెల్లి కనీసం వారి దహన సంస్కారాలకు సహాయం చేయకుండా, ఫోటోలకు ఫోజులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషి యా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లన రవి, జన్ను అదాం, గిన్నారం రాజు, జన్ను వేణు, పాల్గొన్నారు.