Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు యనమల కిరణ్
నవతెలంగాణ-తొర్రూరు
జిల్లాలోని దళితులందరికీ దళిత బంధు వర్తింపజే యాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు యనమల కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం తొర్రూర్లో ఏర్పాటు చేసిన సంఘ సమావేశంలో జిల్లా కార్యదర్శి రామ్మూర్తితో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా లక్షా6వేల దళిత జనాభా ఉంటే కేవలం 250మందికి మాత్రమే దళిత బంధు వచ్చిందని, మిగిలిన వారికి కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయాలని కోరారు. మహిళలపై జరుగు తున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం చేసి దళిత వర్గాలను ఆదుకోవాలని కోరారు. దళిత కాలనీలలో సమ స్యలు పేరుకుపోయాయని, దళిత వాడల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని అన్నారు. దళితబంధులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా, పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. అధికార పార్టీకి చెందినవారినే ఎంపిక చేసుకుంటున్నారని, దీంతో దళిత బంధు ప్రభుత్వ బంధు పథకంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కులాం తర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, వివాహాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి రూ.5లక్షల ప్రోత్సాహం అందించాలని కోరారు. దళిత సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఆగస్టు 7,8,9 తేదీల్లో సంగారెడ్డి లో నిర్వహించే రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయా లని కోరారు. ఇందుకు కేవీపీఎస్ మండల బాధ్యులు మండలవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలన్నారు. దళిత వర్గాల అభివృద్ధికి ఈ మహాసభల వేదికగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దర్గయ్య, మండల అధ్యక్షులు ఫస్తం భాస్కర్, యాసారపు రజినీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.