Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
నవతెలంగాణ-తరిగొప్పుల
హమాలీ కార్మికుల సంక్షేమం కోసం, 50ఏండ్లు నిండిన హమాలీ కార్మికులకు నెలకు రూ.5 వేల పింఛను ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్ కార్య క్రమంను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో పాండ్యల అంజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన హమాలీ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హమాలీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని అన్నారు. హమాలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవు తున్నా రని అన్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడు తున్నారని అన్నారు. వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను, ఆగస్టు 3వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా చందు నాయక్, సీఐటీయూ హమాలి యూనియన్ నాయకులు మాచర్ల సమ్మయ్య, కలకుంట్ల నరసింహులు, ఆసరి గట్టయ్య, లక్ష్మీనారాయణ, చింతల మహేందర్, అసరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : హమాలీ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం హమాలీ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు తెలిపారు. మండలంలోని నిడిగొండ మహాలక్ష్మి సివిల్ సప్లై గోదాం హమాలి కార్మికుల సమావేశం దొర గొల్ల యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. సీఐటీయూ జిల్లా నాయకులు పొదల నాగరాజు, జి మహేందర్, మహాలక్ష్మి గొదాం హమాలీ యూనియన్ నాయకులు మాధురి యాదగిరి, చేవెళ్ల శ్రీశైలం, కాట రాజు, ఉపేందర్, బుచ్చయ్య పెండ్యాల శ్రీను, దోరగొల్ల నర్సింహులు, సత్తయ్య పెండ్యాల ఉపేందర్, ఆరూరి ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
నర్మెట్ట : హమాలీ కార్మికుల సంక్షేమం కోసం హమాలీ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమనికి హమాలి భవన నిర్మాణ, ఆటో కార్మికులు తరలిరావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు కోరారు. మండల కేంద్రంలో సోమవారం పండుగ రాజారాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన హమాలి కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హమాలి యూనియన్(సీఐటీయూ) మండల నాయకులు కొన్నే రవీందర్, ప్రజ్ఞాపురం రమేష్, కొన్నే బాల సిద్ధులు, పి మల్లేశం, బండి నాగరాజు, బి కర్ణాకర్, పి సిద్ధులు, లింగం, రాములు, తదితరులు పాల్గొన్నారు.