Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గోపి,పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్
నవతెలంగాణ-జనగామ
వరద నీటి నిల్వతో ఇబ్బంది పడుతున్న 3, 4వ వార్డులో సీసీ రోడ్లు వేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని మూడవ, నాలుగవ వార్డులో వరద ముంపు ప్రాంతంలో సీపీఐ(ఎం) బృందం పర్యటించింది. ఎల్లమ్మ గుడి వద్ద నిల్వ ఉన్న మురుగు నీటికుంటలో ప్రజలు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు కురిసి విరామం ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా ఇంకా బాలాజీ నగర్, జ్యోతి నగర్, ఎల్లమ్మ గుడి ఏరియా జీఎంఆర్ కాలనీలు నీటిలోనే ఉన్నాయని అన్నారు. రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. మురుగునీరు నిల్వ ఉండడం ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. అధి కారులు వార్డులను సందర్శించి సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేశారు. ఇండ్లమధ్యల ఖాళీ ప్లాట్లలో నిలిచిన నీళ్లను మోటార్లతో బటయటకు పంపించా లన్నారు. లేదంటే ప్రజలను ఐక్యం చేసి మున్సిపల్ ముందు ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు బాల్నే వెంకట మల్లయ్య, బూడిది జ్యోతి, మారేడు విష్ణు, ఎండీ మున్నీర్ వార్డు ప్రజలు బిట్ల శోభ, గుండు అరుణ, శ్రీనివాసులు, లక్ష్మీ గిరిజ, సునీత, తదితరులు పాల్గొన్నారు.