Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాద్ పట్టణంలో సెప్టెంబర్ చివరి వారంలో తెలంగాణ బిల్డింగ్ అం్డ్ అధర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర 3వ మహాసభలను నిర్వహించనున్నట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు తెలిపారు. సోమవారం యూనియన్ జిల్లా విస్తృస్థాయి సమావేశం టి శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ... 60 ఏండ్లు పైబడిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథ కాలకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు జాప్యం లేకుండా సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ అధి కారులు అవినీతికి ఆశపడి దళారులను ఏర్పాటు చేసుకుని వారికి మాత్రమే లబ్ది చేసి ఇతరుల దరఖాస్తులను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. వెల్ఫేర్ బోర్డు నుండి రూ.3వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దారిమల్లించిందని విమ ర్శించారు. కార్మికుల పిల్లలకు స్కాలరుషిప్లు ఇవ్వాలని ఇతర పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభల విజయవంతానికి సహకరించాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగూరి రాముల, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు, జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కుంట ఉపేందర్, ఆకుల రాజు, యూనియన్ జిల్లా నాయకులు గారె కోటేశ్వరరావు, బానోత్ శంకర్, యాదగిరి, హుస్మాన్, ఉప్పలయ్య, శ్రీను, సైదులు, సుధాకర్ తదితరలు పాల్గొన్నారు.