Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియు జిల్లా అధ్యక్షుడు దావూద్
నవతెలంగాణ-ఏటూరునాగారంటౌన్
తెలంగాణ గిరిజన సంఘం. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా బుధ వారం తలపెట్టిన ఐటీడీఏ ముందు జరిగే ధర్నాకు పోడు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దావూద్‌తో పాటు గిరిజన సం ఘం జిల్లా కమిటీ సభ్యుడు తోలం కష్ణయ్య, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి యాకూబ్ సంఘీభావం తెలు పుతూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాల క్రితం చట్ట సభలో (పార్లమెంటులో) చట్టబద్ధంగా తెచ్చిన 2005 అటవీ హక్కు చట్టాన్ని ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ఇంతకాలం మాటతప్పిన ప్రభుత్వాది నేతలకు ప్రజలు ఏ శిక్ష వేయాలో నిర్ణయించాలన్నారు. ఇప్పటికైనా ఉన్న చట్టాన్ని. ఇచ్చిన మాటలను నిలుపుకోవాలని లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి
తాడ్వాయి : అటవీ హక్కుల చట్టాన్ని అమలు చే యాలని నేడు ఏటూర్‌నాగారం ఐటిడిఏ ముందు జరిగే ధర్నా ను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సం ఘం ములుగు జిల్లా కార్యవర్గ సభ్యుడు బి రెడ్డి సాంబ శివరెడ్డి, తాడ్వాయి మండల గిరిజన సంఘం మండల అధ్య క్షుడు దుగ్గి చిరంజీవిలు అన్నారు. మంగళవారం మండ లంలోని గంగారం, బంజర, నాంపల్లి బంజర, కాటాపూర్, పంభా పూర్, దామరవాయి, భూపతిపూర్, నర్సాపూర్, బీరెల్లి, ఆశన్నగూడ ఎల్లాపూర్, రంగాపూర్ గ్రామాలలో విస్తతంగా పర్యటించి ఆదివాసి గిరిజనుల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవి హక్కుల చట్టం అమలు చేయాలని దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ అక్కుపత్రాలు కల్పించాలని ఎటునాగరంలో జరుగుతున్న ధర్నాకు మేధావులు మహిళలు గిరిజనులు ఆది వాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు చిరంజీవి, రైతులు, ఆదివాసి గిరిజనులు పాల్గొన్నారు.