Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), టిఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-వరంగల్
బల్దియా కార్పొరేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికులకు రూ.21 వేల వేతనం ఇవ్వాలని సీపీఐ(ఎం), టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిర సన తెలిపారు. అనంతరం బల్దియా అదనపు కమిషనర్ రషీద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా నాయకులు సింగారం బాబు మాట్లాడుతూ కార్పొ రేషన్‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్థానిక సమస్యలు పరిష్కరిం చాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కు టుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి నెలా 5లోపు వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఉప్పలయ్య, టీ ఎమ్మార్పీఎస్ నాయకులు బొట్ల బిక్షపతి తది తరులు పాల్గొన్నారు.