Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎక్కడ
- హామిలేని ఇనుగుర్తికి ఇచ్చారు
- హామీ ఉన్న మల్లంపల్లి ఎక్కడ
- పెట్రోల్ పోసుకొని యువకుల నిరసన
- భారీగా తరలివచ్చిన ఉద్యమకారులు
- రెండు గంటల పాటు వాహనాలకు అంతరాయం
- మల్లంపల్లిలో హై టెన్షన్
నవతెలంగాణ-ములుగు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మండలాల జాబితాలో మల్లంపల్లి లేకపోవడంతో గ్రామంలో నిరసనకారులు నిరసన తెలిపారు. పరిసర ప్రాంతాల గ్రామాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మల్లంపల్లి మండలానికై నిర సన జ్వాలలు రేకిత్తించారు. మల్లంపల్లి మండలానికై 3 సం వత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నారు.అయినప్పటికీ ప్రభు త్వం స్పందించక పోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ములు గుకు వచ్చిన కెసిఆర్ ఆనాడు ములుగును జిల్లాగా , మల్లం పల్లిని మండలంగా ప్రకటిస్తానని స్వయంగా హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినవస్తున్నాయి.
ఓట్ల కోసమే పాట్లా.....
ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మల్లంపల్లి మండలం పేరు చెప్పి ఓట్లు వేయించుకున్న నా యకులు ఈనాడు మండలం పై మాట్లాడక పోవడం వారి అసమర్ధతకు కారణమన్నారు. ఎన్నికల సమయంలో హామీ లిచ్చి న నాయకులు ఎందుకు మండలం పై మాట్లాడడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
మండలం రాకపోవడానికి
ఆ ప్రజాప్రతినిధి వైఫల్యమేనా
నిత్యం మల్లంపల్లిలో ఉంటూ ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్ల మండలం పేరు వాడుకున్న ఆ ప్రజా ప్రతినిధి నేడు మండలం పై ఎందుకు మాట్లాడడం లేదని గ్రామ ప్రజలు అంటున్నారు. సీఎం,మంత్రి కేటీఆర్ కు దగ్గరగా ఉంటూ సొంత ఊరును మండలం చేయలేదనే అపవాథం ఆ నాయకుడు మూటగట్టుకున్నారు. చివరికి మండలాల జాబితాలో మల్లంపల్లి లేక పోవడంతో గుర్రుగా ఉన్నారు.
హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎక్కడ
ములుగుకు ఎన్నికల ఇంచార్జిగా వచ్చిన ఆ నాయకుడు ప్రతి ఎన్నికల్లో మండలం పేరు చెప్పి ఓట్లు దండుకుని లబ్ధి పొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే మండలం వస్తుందని నమ్మ బలి కి ప్రజలను నట్టేట ముంచారని అంటున్నారు.
హామిలేని ఇనుగుర్తికి ఇచ్చారు హామీ ఉన్న మల్లంపల్లి ఎక్కడ
స్వయంగా మల్లంపల్లిని మండలం గా ప్రకటిస్తానని చెప్పిన సీఎం కెసిఆర్,హామీ నీ తుంగలో తొక్కారనీ నిరసన కారులు అంటున్నారు. హామీ లేని ఇనుగుర్తిని మండలం గా ప్రకటించిన కెసిఆర్ హామీ ఇచ్చిన మల్లంపల్లి నీ ఎందుకు పక్కన పెట్టారనే వాదన మల్లంపల్లి వాసుల్లో బలంగా వినపడుతుంది.
భారీగా తరలివచ్చిన ఉద్యమకారులు
ప్రభుత్వం ప్రకటించిన మండలాల జాబితాలో మల్లం పల్లి పేరు లేకపోవడంతో స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున మల్లంపల్లి లో సమావేశ మయ్యారు. దాదాపుగా 2 గంటల పాటు గా మల్లంపల్లి లోని జాతీయ రహదారిపై స్థానికులు చేరుకొని నిరసన తెలిపారు. దాదాపుగా మూడేళ్లుగా ఉద్యమం చేస్తున్న యువకులు మండల సాధన కొరకై తమ ప్రాణాలను సైతం లెక్క చేయ కుండా కొంత మంది తమ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం తో అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
మల్లంపల్లిలో హై టెన్షన్
మల్లంపల్లి లో స్థానికులు ,పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా మల్లంపల్లి కి చేరుకోవడం తో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా జన ప్రభంజనంతో మల్లంపల్లిలో జై మల్లంపల్లి మండలం అంటూ నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న ప్రజలను అదుపు చేశా రు. కార్యక్రమంలో మండల సాధన సమితి అధ్యక్షుడు గో ల్కొండ రాజు,నాయకులు గాజు అజేరు కుమార్, కాను గంటి సతీష్, బబ్బులు, శేఖర్, కుక్కల సంపత్, కాంగ్రెస్ నాయకులు గోల్కొండ రవి,చంద రాము ,అనిల్ రెడ్డి, శ్రీకాం త్ రెడ్డి, రవి బాబు, శ్యాం రావు, రాం రెడ్డి, కోంగరి నరేందర్, మొర్రి రాజు, పాల్గొన్నారు.