Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం మండల కార్యదర్శి అమ్జద్ పాషా
నవతెలంగాణ-ములుగు
వీఆర్ఏలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి అమ్జద్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం రెండో రోజు మండల కేంద్రంలో నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరింది. ఇట్టి సమ్మెకు మద్దతుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి అమ్జద్ పాషా, బహుజన సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు బొట్ల కార్తిక్, జిల్లా ఇన్చార్జి నరేష్, సతీష్, సిపిఎం నాయకుడు జి రవిగౌడ్, గుట్టమీద ముసలయ్య, ఆలయ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు సమ్మె శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా వీఆర్ఏ జేఏసీ అధ్యక్షులు పాండవుల మహేందర్ ఉపాధ్యక్షులు, కాసర్ల రాజయ్య, జేఏసీ కన్వీనర్ గుర్రం తిరుపతి, రాజు, మండల అధ్యక్షులు నన్నవైన సురేష్, మండల కార్యనిర్వాహక అధ్యక్షులు పరికరాల మహేష్, నాగుల నరేష్, బూరుగు సందీప్ సదయ్య, సాంబయ్య, పద్మ రజిత, లావణ్య, సూర్యకళ, వీఆర్ఏలు పాల్గొన్నారు.
తాడ్వాయి : రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ లు చేసున్న దీక్ష న్యాయమైనదనీ వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు తాడెం వీరస్వామి అన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు సాయిరి శ్రీను, మం డల సంఘం అధ్యక్షుడు సారయ్య, వీఆర్ఏలు పాల్గొన్నారు.
రాయపర్తి : తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం మండల వీఆర్ఏలు నిరవధిక సమ్మె రెండవ రోజు కొనసాగింది. కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసి మం డల చైర్మన్ నాగుల రాంమ్మూర్తి, గాదె అశోక్, మహంకాళి యాకయ్య, చిలుముల్ల వెంకటయ్య, కనుకుంట్ల ఉప్పలయ్య, పద్మ, బిక్షపతి, సోమనర్సయ్య, కొమురయ్య, పాల్గొన్నారు.
వెంకటాపూర్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కాసర్ల రాజయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. సమ్మెలో మండల అధ్యక్షులు నక్క శశి కుమార్, ఉపాధ్యక్షులు తొగరి మురళి, ప్రధాన కార్యదర్శి మంతెన స్వప్న. గాజుల కష్ణ ప్రసాద్, పొనుగంటి శంకర్, అలుగోజు శ్రీకాంత్, రడపు సరిత, కుమారస్వామి, వీఆర్ఏలు పాల్గొన్నారు. .
మంగపేట : వీఆర్ఏల నిరవదిక దీక్షలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు పాగ బాబు, నాగార్జున, మూర్తి, నర్సింహారావు, శ్రీనివాస్, రాము, నరేష్, సమ్మయ్య, సందీప్, ఖాజాహుస్సేన్, పాపారావు, ముత్తయ్య, కౌసల్య, సమ్మక్క, మాదవి, వెంకటనర్సమ్మ, ఈశ్వరమ్మ, గౌసియా, పగిడమ్మ, రాజేశ్వరి, లక్ష్మీలు పాల్గొన్నారు.
పర్వతగిరి : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహా యకుల న్యాయమైన డిమాండ్లను, కోర్కెలను పరిష్కరిం చాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. దీక్షలో ఆ సంఘం మండల అధ్యక్షుడు పోగుల రమేష్, గౌరవ అధ్య క్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి కొమురయ్య, కోశాధికారి నీరటి వీరేష్, రాధిక, సుమతి, సునిత తదితరులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎంసిపిఐ పార్టీ సంఘం మండల కార్యదర్శి ఎండిఇస్మాయిల్ మంగళవారం పర్వతగిరి లో సమ్మెకు మద్దతు తెలిపారు.
సంగెం.: తహసీల్దార్ కార్యాలయము ఎదుట వీఆర్ఏల 2 వ రోజు సమ్మె మండల చైర్మన్ జీజుల సత్య దేవ్ ఆధ్వర్యములో నిర్వహించారు. మండల విలేజ్ రెవె న్యూ అధికారులు బి.స్వామి, ఎన్. దేవేందర్, బి.భారతి, కె.ఎల్లయ్య, వి.చంద్రమౌళి, ఎం సీపీఐ మండల కారదర్శి ఎం.డి ఇస్మాయిల్ సంఘీభావం తెలిపారు. సమ్మెలో మం డల కో చైర్మన్ ఆకుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శులు మేదరి యాకయ్య, కొత్తపల్లి శ్రీదేవి, కన్వీనర్లు తీగారపు రజిత, బోగి లింగం, రఘునందన్, స్వామి, రాజేష్, పాల్గొన్నారు.
గోవిందరావుపేట: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం సభ్యులు ధారావత్ రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు పత్రి పున్నం ఆధ్వర్యంలో రెండో రోజు నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరింది. కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షులు మగ్గం సాంబయ్య, ప్రధాన కార్యదర్శి గద్దల రాజు, ఉరపెద్ది కన్నయ్య, ఉరపెద్ది లక్ష్మీ, గద్దల కమలహాసన్, గందర్లా వెంకన్న, పసుల రాంబాబు, రెడ్డి సమ్మక్క, అంబటి సారమ్మ, పోలేపాక సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : వీఆర్ఏల సమస్యల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి తగదని కాంగ్రేస్ నాయకులు పెండెం రామానంద్, కౌన్సిలర్ వేముల సాంబయ్య అన్నారు. వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మె మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకొన్నాయి. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట చేపడుతున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లైనా పేస్కేల్ జీవోను విడుదల చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, 55 యేండ్లు పూర్తి అయినా వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ చైర్మన్ బిర్రు సునిల్ తదితరులు పాల్గొన్నారు.