Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాం గ రద్దు కుట్రలను పోరా టాలతో ప్రతిఘటించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ అన్నారు. మంగళవారం కేవీపీఎస్ పట్టణ ముఖ్యకార్యకర్తల సమావేశం జిల్లా నాయ కులు సింగారపు బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రద్దు చేసి దళితులకు తీరని అన్యాయం చేసిందన్నారు. దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాందని, దళితుడికి ముఖ్యమంత్రి పదవీ, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏఒక్కటి అమలు చేయలేదన్నారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ మతో న్మాద పాలన, రాష్ట్రంలో టీఆర్ఎస్ దళిత వ్యతిరేక పాలనపై ప్రజల చైతన్యం కోసం కేవీపీఎస్ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సన్నద్ధం కావాలని సూచించారు.
కేవీపీఎస్ పట్టణ కమిటీ ఎన్నిక
కేవీపీఎస్ పట్టణ అధ్యక్షులుగా మోలుగూరి రాజు, కార్యదర్శి సింగారపు బాబు, ఉపాధ్యక్షులుగా ఎడ్ల స్వామి, చిలుక సారంగపాణి, జెట్టి కమల్, సహాయ కార్యదర్శి యాకయ్య, మహేందర్, తాళ్లపెల్లి సాగర్, కమిటీ సభ్యులు ఈరెల్లి రాజు, తాళ్లపెల్లి రాజు, గాదె రాంబాబు ప్రశాంత్, ఎల్లయ్య, శ్రీను, దేవేందర్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనందం, జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ సంజీవ తదితరులు పాల్గొన్నారు.