Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
వీవోఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని అడ ిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ గొట్టె శ్రీనివాస్, మండల ప్రాజెక్టు మే నేజర్ ముక్కెర ఈశ్వరయ్య అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆశాజ్యోతి మం డల సమైక్య కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామా ల సంఘాల కార్యకర్తలకు ప్రాజెక్టు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గ్రామ సంఘాలకు పని చేస్తున్న వివోఏలు సకాలంలో సభ్యులకు జవాబు దారి తనంతో లక్ష్యాలను సాధించాలన్నారు. విధుల నిర్వ హణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసు కుం టామన్నారు. ఆర్థిక స్వాలంబన దిశ వైపు మహిళా సంఘా లను ప్రయాణించేలా ప్రతి ఒక్కరు కషి చేయాలని, ప్రతి గ్రామ సంఘంలో ఆదాయ అభివృద్ధిలో భాగంగా ఉత్పత్తి రం గాల లో, సేవా రంగాలలో, మార్కెటింగ్ రంగాల్లో కార్యక్ర మాలు లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేయాలని ఏపీ డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు ప్రమీల, స్వరూప, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు కట్టయ్య, వెంకటేశ్వర్లు, సుజాత, మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.