Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిపిఎస్ ప్రొటెక్షన్ అధికారి ఎన్ హరికృష్ణ
నవతెలంగాణ-ములుగు
బాలలు తమ హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని ఐసిపిఎస్ ప్రొటెక్షన్ అధికారి ఎన్ హరికృష్ణ తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ములుగు ఆధ్వర్యం లో జిల్లాలోని వివిధ విద్యా సంస్ధల్లో చదువుతున్న బాలబాలికలకి వివిధ బాలల హక్కుల ఉల్లంఘనలు, పిల్లల పై లైంగిక నేరాలు, బాల్యవివాహాలు వంటి సమస్యలపై అవగాహన కల్పిం చుటకు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా మంగ ళవారం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల జగ్గన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లక్ష్మి ఆదిరెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ విద్యా ర్థులకు పై చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సమాజం లో బాల బాలి కలపై లైంగిక దాడులు అధికమవడం చాలా బాధా కరమని, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా వారిని ఈ కార్యక్రమం ద్వారా అవగాహనపర్చి తమను తాము కాపాడుకొనేలా, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చట్టపరమైన రక్షణ పొందేలా జిల్లా లోని బాలల బాలికలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వర్ణ, చైల్డ్ లైన్ టీం మెంబర్ చంటి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.