Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా
- నాయకులు బెజ్జంకి రఘు మహాజన్
నవతెలంగాణ-ములుగు
వర్గీకరణతోనే మహాజన సోషలిస్టు రాజ్యం సాధ్యమని బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు బెజ్జంకి రఘు మహాజన్ తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకష్ణ మాదిగ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం మీద నిరసనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు మంగళవారం ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్షను సందర్శించి సంఘీభావం తెలిపారు. అనం తరం రఘు మహాజన్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ఉన్న 59 కులాలకు ఏబిసిడిలు గా వర్గీకరించి అన్ని రం గాల్లో సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత భారత పార్లమెంటరీ విధానం ఉందన్నారు.ఉభయ రాష్ట్రాల్లో బీజేపీ కేంద్ర మంత్రుల పైన,పెద్దలపైనా ఉందని న్యాయమైన డిమాండ్లను విస్మరిస్తే రాష్ట్రంలో బిజెపి పుట్టగతులు లేకుండా బొంద పెడతామని హెచ్చరించారు. శిబిరంలో ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా కన్వీనర్ పుల్లూరు కర్ణాకర్, మహాజన సోషలిస్టు పార్టీ ములుగు కోఆర్డినేటర్ జన్ను రవి మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు నెమ లి నర్సయ్య మాదిగ, జిల్లా కో కన్వీనర్ వాసంపల్లి చెంతన్, మండల కన్వీనర్ కనకం దాస్, జిల్లా నాయకులు పారు నందుల శీను, మారటి రవీందర్, కోతి కార్తిక్, వెంక టేశ్వ ర్లు. రత్నం ప్రవీణ్, రాంచందర్, జయాకర్, పాల్గొనినారు.