Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నిస్తే దాడులు చేయడం సరికాదు
- బిజెపి రాష్ట్ర నాయకుడు వెంగళ్రావు
నవతెలంగాణ-రాయపర్తి
రోడ్డు నిర్మాణాలు చేపడుతూ ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడంతో ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని బిజెపి రాష్ట్ర నాయకుడు నెమరుగొమ్ముల వెంగళ్రావు అన్నారు. మండలంలోని కాట్ర పల్లి శివారు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో సుమారు రూ.14 లక్షల 75 వేలతో మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టా రు. కొద్దికాలానికే వర్షం నీరు ప్రవాహానికి రోడ్డు కొట్టుకు పోయింది. దీంతో బిజెపి నాయకులు మంగళవారం రో డ్డును సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 200 మంది రైతులకు ఉపయోగపడే దారిని నాసిరకంగా నిర్వహించడం సిగ్గుచేటన్నారు. గతంలో రైతులే ఎకరానికి రూ.1500 చొప్పున చందాలు వేసుకొని మొరంతో దారి నిర్మించుకున్నట్లు తెలిపారు. జరిగిన అవినీతిపై బీజేపీ నాయకుడు ప్రశాంత్ ప్రశ్నిస్తే టిఆర్ఎస్ లీడర్లు దాడికి ప్రయత్నించడం నీచ రాజకీయానికి నిదర్శనం అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైస లతో రోడ్డు నిర్మాణం చేపట్టిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఉమ్మడి జిల్లా సంస్కతిక శాఖ కన్వీనర్ దామోదర్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి నరేందర్, మండల అధ్యక్షుడు వడ్లకొండ రవి, మండల కార్యదర్శి బూర్గు నవీన్, బీజెవైఎం నియోజకవర్గ కన్వీనర్ శ్రవణ్ కుమార్, మండల అధ్యక్షుడు రాపాక ప్రశాంత్, పాల్గొన్నారు.